coffee day: 'కాఫీ డే' యజమానికి ఐటీ షాక్

  • కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ అల్లుడికి ఐటీ శాఖ షాక్ 
  • కాఫీ డే యజమాని వీజే సిద్ధార్థ నివాసాలపై ఏకకాలంలో దాడులు
  • 20 చోట్ల ఒకేసారి ఐటీ దాడులు
 కాఫీడే కంపెనీ యజమాని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థకు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లోని ఆయన నివాసాలు, కాఫీ తోటలు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టింది. 20 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ దాడులకు దిగడంతో ఆయన నివ్వెరపోయారు. కాగా, కాంగ్రెస్ నేత అయిన ఎస్‌.ఎం.కృష్ణ గత ఏడాదే బీజేపీలో చేరడం విశేషం. కర్ణాటక బీజేపీలో కీలక నేత అల్లుడి నివాసంపై ఆదాయపుపన్ను శాఖ దాడులు చేయడం, ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. 
coffee day
s.m. krishna
siddarth
it raids

More Telugu News