maoists: మావోయిస్టుల నయా ప్లాన్... బదిలీలు ప్రకటించిన అగ్ర నాయకత్వం
- చలపతికి స్థాన చలనం
- ఈస్ట్ డివిజన్ నుంచి కోరాపుట్ కు బదిలీ
- దుబాషి శంకర్ కు ఈస్ట్ బాధ్యతలు
విశాఖ సమీపంలోని ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో భారీ మార్పులు చేయాలని మావో అగ్రనేతలు నిర్ణయించారు. రామగూడ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు తమ ప్రణాళికను మార్చుకుని కమిటీల ప్రక్షాళనకు నడుం బిగించారు. ఈ మేరకు బదిలీలను ప్రకటించారు. మావోయిస్టు కీలక నేత చలపతికి స్థాన చలనం కల్పించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం ఈస్ట్ డివిజన్ కమిటీ బాధ్యతలు చూస్తున్న చలపతిని కోరాపుట్ కమిటీకి బదిలీ చేసినట్టు మావోలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఇకపై ఈస్ట్ డివిజన్ బాధ్యతలను దుబాషి శంకర్ అలియాస్ మహేందర్ కు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మార్పు తక్షణం అమల్లోకి వస్తుందని మీడియాకు ప్రకటనను విడుదల చేశారు.