ratan tata: మోదీపై రతన్‌ టాటా ప్రశంసల జల్లు

తాను ప్రధాని నరేంద్ర మోదీని చాలా ఏళ్ల నుంచి గ‌మ‌నిస్తున్నాన‌ని ‘నవభారతం’ కోసం ఆయ‌న ఎంతో కృషి చేస్తున్నార‌ని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా కంపెనీ అధినేత రతన్‌ టాటా అన్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... మోదీ వేగంగా విధాన నిర్ణయాలు తీసుకుంటార‌ని అన్నారు. గ‌తంలో మూడు రోజుల్లోనే భూకేటాయింపులు జరిపి, పశ్చిమ బెంగాల్‌ నుంచి గుజరాత్‌కు టాటా నానో కారు ఫ్యాక్టరీ తరలిరావడానికి మోదీ ఎంతగానో సాయం చేశార‌ని ఆయ‌న అన్నారు. న‌వ‌భార‌తం కోసం క‌ల‌లు కంటున్న ఆయ‌న‌కు ఒక అవకాశాన్ని ఇవ్వాలని వ్యాఖ్యానించారు. భారత్‌ను ఆ దిశ‌గా మార్చే సామర్థ్యం ఆయనలో ఉందని తెలిపారు. మోదీ ఆశ‌యాలు నెర‌వేరాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. 
ratan tata
modi

More Telugu News