కోడికూర: వాటీస్ దిస్... చికెన్ వండడం ఇలాగేనా?: వంటవాళ్లపై ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆగ్రహం
ఆస్ట్రేలియా క్రికెటర్లకు చికెన్ నచ్చకపోవడంతో కోపం నషాళానికి ఎక్కేసింది. రేపు మధ్యాహ్నం 1.30కి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వన్డే ఆడడం కోసం వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బెంగాల్ క్రికెట్ సంఘం అధికారులు వడ్డించిన చికెన్ రుచించలేదు. చికెన్‌ను 73 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కాకుండా ఎక్కువగా వేడి చేయించవద్దని ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెంగాల్ క్రికెట్ సంఘానికి చెప్పారట. అయినప్పటికీ చికెన్‌ను బాగా వేడి చేసేసి వడ్డించడంతో ఆసిస్ ఆటగాళ్లకి కోపం వచ్చేసింది. ఈ విషయాన్ని వారు నిలదీసి అడగడంతో మరోసారి ఇటువంటి పొరపాటు చేయబోమని నచ్చజెప్పి వంటవారు ఆ ఆటగాళ్లను కూల్ చేశారట.