rahul gandhi: వైఫల్యాలను అంగీకరించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారు. ప్రతి రోజు 30వేల ఉద్యోగాలను సృష్టిస్తామనే హామీని తాము నెరవేర్చలేక పోయామని చెప్పారు. బీజేపీ కూడా ఈ విషయంలో విఫలమవుతోందని... రోజుకు 30వేల ఉద్యోగాలను సృష్టించలేదంటూ గతంలో తమపై ఆగ్రహం వ్యక్తం చేసినవారు... ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై కూడా కోపంగా ఉన్నారని అన్నారు. మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. అమెరికాలోని ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయం, ఉడ్రో విల్సన్ స్కూల్ లో బోధనా సిబ్బంది, విద్యార్థులతో జరిగిన చర్చలో భాగంగా రాహుల్ గాంధీ పైవ్యాఖ్యలు చేశారు. 
rahul gandhi
princeton university
narendra modi
make in india

More Telugu News