kotla suryaprakash reddy: చంద్రబాబు మా ఇంటికి వస్తున్నట్టు సమాచారం అందింది.. కానీ, రాలేదు: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న తమ ఇంటికి వస్తున్నట్టు పోలీసులు సమాచారం అందించారని... కానీ ఆయన రాలేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తమ ఇంటికి ఎప్పుడొచ్చినా మన:స్పూర్తిగా ఆహ్వానిస్తామని చెప్పారు. మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని... తాను కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. అవసరమైతే రాజకీయాలను వదిలి, వ్యవసాయం చేసుకుంటానే తప్ప... కాంగ్రెస్ పార్టీని వదలనని చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.


kotla suryaprakash reddy
kotla on party change
chandrababu
ap cm

More Telugu News