సుమంత్: చిన్నప్పుడు తనను ఏఎన్ఆర్ ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేసిన మనవడు సుమంత్!
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతి సందర్భంగా అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఆయనతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. యువ నటుడు సుమంత్.. తాత అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకుంటూ పసితనంలో తనను ఆయన ఎత్తుకుని ఉండగా తీసిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో మనవడు సుమంత్ ను ఎత్తుకుని నాగేశ్వరరావు మురిసిపోతున్నారు. బుల్లి సుమంత్ కూడా చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఈ ఫొటో అక్కినేని అభిమానులను అలరిస్తోంది.