'స్పైడర్'లో ఒక్క నెగటివ్ పాయింట్ కూడా లేదు!: ఉమేర్ సంధు
- విదేశాల్లో భారతీయ సినిమాలను సెన్సార్ చేసే ఉమేర్ సంధు
- స్పైడర్ అదిరిపోయింది
- ఈ సినిమాలో డల్ పాయింట్సే లేవు
- సినిమా ఆద్యంతం రేసులా పరుగులు పెట్టింది
- మహేష్ బాబు సూపర్
- మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్
సినిమా అద్భుతంగా ఉందని తెలిపాడు. సినిమాలో ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదని చెప్పాడు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు రేసుగుర్రంలా పరుగులు తీసిందని అన్నాడు. మహేష్ బాబు ఎప్పట్లాగే అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని తెలిపాడు. మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఉమేర్ సంధు తెలిపాడు. అయితే ఈసినిమాకు రేటింగ్ మాత్రం ఇవ్వకపోవడం విశేషం.