mujaffar nagar: మోదీజీ.. ఆ దుర్మార్గుడిని చంపేయండి: ప్రధానికి లేఖ రాసిన విద్యార్థిని

  • ఏడాది నుంచి విద్యార్థినిని వేధిస్తున్న ఆకతాయి
  • ప్రధానికి తన బాధను తెలియజేసిన విద్యార్థిని
  • ఇంటి నుంచి బయటకు రావాలన్నా భయమేస్తోందన్న బాధితురాలు
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్ని చర్యలను తీసుకుంటున్నా... ఆ రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు తగ్గడం లేదు. మహిళలు, బాలికలపై ప్రతి రోజు లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తాను అనుభవిస్తున్న నరకాన్ని ఓ కాలేజీ విద్యార్థిని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే, ముజఫర్ నగర్ కు చెందిన విద్యార్థినిని ఓ ఆకతాయి ఏడాది కాలం నుంచి వేధిస్తున్నాడు. తన వెంట పడవద్దని అతనికి ఎన్నో సార్లు చెప్పినా... అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా వేధింపులను మరింత ఎక్కువ చేశాడు. దీంతో, బాధితురాలు భయాందోళనలకు గురైంది.

చివరకు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాసింది. తనను వేధిస్తున్న దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని లేఖలో వేడుకుంది. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయం వేస్తోందని తెలిపింది. దీనిపై ఇంకా అధికారులు స్పందించాల్సి ఉంది.
mujaffar nagar
narendra modi
student letter to modi

More Telugu News