vikram: విక్రమ్ కి ఈ ఏడాదైనా కలిసొస్తుందా!

 విక్రమ్ తాజా చిత్రంగా 'స్కెచ్' 

 వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు

 కథానాయికగా తమన్నా 

 ప్రమోషన్స్ కొత్తగా ప్లాన్ చేస్తోన్న విక్రమ్          

కోలీవుడ్ లో ప్రయోగాత్మక పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే సీనియర్ కథానాయకులలో కమల్ తరువాత స్థానంలో విక్రమ్ కనిపిస్తాడు. తెరపై ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ఇష్టపడే విక్రమ్ కి, ఈ మధ్య కాలంలో విజయాలు కరువయ్యాయి. 2015 నుంచి ఇప్పటి వరకూ ఆయన హిట్ కొట్టలేకపోయాడు. దాంతో 'స్కెచ్' సినిమాతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో విక్రమ్ వున్నట్టుగా తెలుస్తోంది.

 విజయ్ చందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ సరసన తమన్నా నటించింది. వచ్చే నెలలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఇది కూడా సక్సెస్ ను ఇవ్వకపోతే, ఈ ఏడాది కూడా ఆయన అభిమానులకు నిరాశనే మిగిల్చినట్టు అవుతుంది. అందువల్లనే ప్రమోషన్స్ కొత్తగా ఉండేలా విక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఆయన ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.        
vikram
tamanna

More Telugu News