ss rajamouli: చంద్రబాబుతో ఎక్కువ సేపు మాట్లాడలేకపోవడానికి కారణం ఇదే: రాజమౌళి

  • పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు
  • ఫ్లైట్ లేటయింది
  • మధ్యాహ్నం పూర్తి స్థాయిలో చర్చిస్తాం
  • మంత్రి నారాయణతో కలసి లండన్ వెళుతున్నా
అమరావతి నిర్మాణాల డిజైన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పూర్తి స్థాయి చర్చ జరగలేదని దర్శక దిగ్గజం రాజమౌళి తెలిపారు. విమానం ఆలస్యం కావడంతో, తాను కొంచెం లేట్ గా వచ్చానని... షెడ్యూల్ ప్రకారం కలెక్టర్ల మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉందని చెప్పాడు. దీంతో, అరగంటలోనే తమ సమావేశం ముగిసిందని... పూర్తి స్థాయిలో చర్చ కొనసాగలేదని తెలిపారు. మధ్యాహ్నం జరిగే భేటీలో పూర్తి స్థాయిలో చర్చిస్తామని అన్నారు. దేశ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలని, ఈ దిశగా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారని చెప్పారు. దీనికితోడు, మంత్రి నారాయణతో కలసి లండన్ వెళ్లి, నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు రూపొందించిన డిజైన్లను పరిశీలించాలని కోరారని తెలిపారు.

వచ్చే నెల తొలి వారంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో కలసి రాజమౌళి లండన్ వెళ్లనున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ నార్మన్ ఫోస్టర్స్ డిజైన్లను పరిశీలించిన తర్వాత తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.
ss rajamouli
rajamouli meets chandrababu
chandrababu
amarathi designs

More Telugu News