Abishek Goud: అమ్మాయిలను వేధిస్తున్న టీఆర్ఎస్ కార్పొరేటర్ తనయుడి అరెస్టు!

  • మల్కాజిగిరి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తనయుడు అభిషేక్ గౌడ్ అరెస్టు
  • సోషల్ మీడియాలో యువతులకు వేధింపులు
  • షీటీమ్స్ కు ఫిర్యాదు చేసిన బాధితులు 
  • అభిషేక్ గౌడ్ తో పాటు మరోఇద్దరిపై ఫిర్యాదు
అమ్మాయిలను వేధిస్తున్న జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడు అభిషేక్ గౌడ్ ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదులోని మల్కాజ్‌ గిరి ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ఎన్.జగదీశ్వర్ గౌడ్ తనయుడు అభిషేక్‌ గౌడ్‌ సోషల్ మీడియాలో పలువురు అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో అతనిపై ముగ్గురు యువతులు షీటీమ్స్ కు ఫిర్యాదు చేశారు. అతనితో పాటు మరో ఇద్దరిపై కూడా వారు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిషేక్ ను అరెస్టు చేశారు. అతని అరెస్టుతో మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు. 
Abishek Goud
social media
Hyderabad she teams

More Telugu News