mexico: మెక్సికోలో భారీ భూకంపం...కూలిపోయిన భారీ భవనాలు

  • మెక్సికోను వణికించిన భూకంపం
  • భూకంపం తీవ్రత 7.4
  • పేకమేడల్లా కుప్పకూలిన భారీ భవనాలు
  • శిథిలాల కింద మనుషులు
  • ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు
మెక్సికోను మరోసారి భూకంపం వణికించింది. నేటితెల్లవారుజామున మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.4గా రికార్డయింది. దీని ధాటికి మెక్సికో చిగురుటాకులా వణికింది. భవనాలు కుప్పకూలిపోయాయి. నేల నోరుచాచి భారీ భవంతులు, మనుషులను తనలోకి లాగేసుకుంది. దీంతో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వేలాది మందికి గాయాలయ్యాయి. ప్రాణభీతితో ప్రజలు పరుగులు తీశారు. వేగంగా స్పందించిన ప్రభుత్వం సహాయకచర్యలు ప్రారంభించింది. సీసీ కెమెరాల్లో భూకంపానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. 
mexico
earth quake
7.6 earth quake

More Telugu News