bitthiri satthi: బుల్లితెర నుంచి సినిమాల దిశగా బిత్తిరి సత్తి?

  •  'తీన్మార్' కార్యక్రమం ద్వారా బిత్తిరి సత్తి పాప్యులర్
  •  సినిమాలలో వరుస అవకాశాలు
  •  'తీన్మార్' చేయడం మానేస్తాడంటూ ప్రచారం 
బుల్లితెర ప్రేక్షకులకు 'బిత్తిరి సత్తి' గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అంతగా ఆయన తనదైన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. 'బిత్తిరి సత్తి' అసలు పేరు చేవెళ్ల రవి .. రంగారెడ్డి జిల్లాకి చెందినవాడు. 'వీ సిక్స్' ఛానల్ లో ప్రసారమవుతోన్న 'తీన్మార్' కార్యక్రమం ద్వారా ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు. సోషల్ మీడియాలోను ఆయనకి మంచి ఫాలోయింగ్ వుంది.

 అలాంటి 'బిత్తిరి సత్తి' ఆ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసి, సినిమాలు చేసుకోవాలనే ఆలోచనలో వున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆయనకి సినిమాలలో వరుస ఆఫర్లు వస్తున్నాయట. దాంతో ఈ కార్యక్రమానికి సమయాన్ని కేటాయించడం కష్టమవుతోందట. అందువలన ఆయన సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ ప్రచారంలో వాస్తవమెంతనే విషయంలో బిత్తిరి సత్తినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.     
bitthiri satthi

More Telugu News