donald trump: నెటిజన్ మాయాజాలం: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ నోట `డెస్పాసిటో` పాట... వీడియో చూడండి!

షార్ట్స్‌లో చూడండి
స్పానిష్ భాష‌లో లూయిస్ ఫొన్సీ, డాడీ యాంకీలు విడుద‌ల చేసిన `డెస్పాసిటో` పాట యూట్యూబ్‌లో చాలా పాప్యుల‌ర్‌. యూట్యూబ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ వీక్ష‌ణ‌లు ఉన్న పాట‌గా ఇది రికార్డు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌కు సంబంధించిన క‌వ‌ర్ వెర్ష‌న్లు ఎన్నో వ‌చ్చాయి. ఇవ‌న్నీ కూడా యూట్యూబ్‌లో మంచి ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. అయితే ఇదే బాట‌లో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ `డెస్పాసిటో` పాట పాడిన వెర్ష‌న్ కూడా ఇటీవ‌ల యూట్యూబ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. నిజానికి ఆయ‌న ఈ పాట పాడ‌లేదు. కాక‌పోతే ఎవ‌రో ఔత్సాహిక నెటిజ‌న్ ట్రంప్ ప్ర‌సంగాన్ని `డెస్పాసిటో` పాట ప‌దాల‌కు స‌రిగ్గా స‌రిపోయేలా ఎడిట్ చేసి, వీడియో పోస్ట్ చేశాడు. దీన్ని చూస్తుంటే నిజంగా ట్రంప్ పాట పాడాడా? అనే అనుమానం త‌ప్ప‌క క‌లుగుతుంది.

Go Back to Shorts
donald trump
despacito
cover version
daddy yankee

More Telugu News