YSRCP mla: వైసీపీలోనే కొనసాగుతానన్న మైదుకూరు ఎమ్మెల్యే!

  • టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల ఖండన 
  • వైసీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నవారే ఈ ప్రచారం చేస్తున్నారు
  • నాది పార్టీ మారే నైజం కాదు
  • ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయ్
తాను టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయని... ఇందులో వాస్తవం లేదని, ఇదంతా కేవలం దుష్ప్రచారం మాత్రమేనని మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి అన్నారు. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరిగినట్టు కొన్ని దుష్ట శక్తులు తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

వైసీపీ టికెట్ కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని... టికెట్ కోసం వారే ఇలాంటి ప్రచారానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి వైసీపీ తరపున తానే పోటీ చేస్తానని చెప్పారు. ఓ పార్టీ తరపున గెలిచి, మరో పార్టీలోకి వెళ్లడం తన నైజం కాదని అన్నారు. కడప జిల్లా దువ్వూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
YSRCP mla
YSRCP mla raghurami reddy
YSRCP
Telugudesam

More Telugu News