jr ntr: 'అల్లు అర్జునే నా ఫేవరేట్ డాన్సర్' అంటున్న జూనియర్ ఎన్టీఆర్!

  • జైలవకుశ ప్రమోషన్ లో బిజీగా జూనియర్ ఎన్టీఆర్
  • బిగ్ బాస్ షో ప్రభావంతో మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్
  • నందమూరి హీరో వ్యాఖ్యతో మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్
అల్లు అర్జునే తన ఫేవరేట్ డాన్సర్ అని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. జై లవకుశ సినిమా ప్రమోషన్ లో జోరుగా పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ పలు ప్రశ్నలకు చురుగ్గా సమాధానాలు చెబుతున్నాడు. బిగ్ బాస్ వ్యాఖ్యాతగా ఆకట్టుకున్న ఎన్టీఆర్ తన సహజమైన వాగ్ధాటితో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా 'జై లవకుశ' ప్రమోషన్లో మరింత కాన్ఫిడెంట్ గా, స్పష్టంగా జూనియర్ సమాధానాలు చెబుతున్నాడు. టాలీవుడ్ లో ఎవరి డాన్సులు నచ్చుతాయని ప్రశ్నిస్తే, బన్నీ డాన్సులే తనకు నచ్చుతాయని తేల్చి చెప్పాడు. నందమూరి హీరో ఇలా తనకు మెగా హీరో డాన్సులు నచ్చుతాయని చెప్పడం పట్ల అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 
jr ntr
allu arjun
hailava kusha promotion

More Telugu News