పవన్ : ప్రభాస్, మహేశ్ వంటి హీరోలకి లేఖలు రాసి.. పవన్ ను పక్కన పెట్టేసిన మోదీ.. చర్చనీయాంశంగా మారిన టాపిక్!
గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం చేసిన సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఏపీలో పెట్టిన సభలో మోదీ కూడా పవన్‌ను ప్రశంసించారు. అయితే, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిపోతోంది. కేంద్ర ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో ఆయనను మోదీ పక్కన పెడుతున్నట్టుగా కనిపిస్తోంది.
తాజాగా, మోదీ దేశంలోని వివిధ రంగాల ప్రముఖులకు లేఖలు రాసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలుగు సినీ ప్రముఖులు రాజమౌళి, మోహన్ బాబు, ప్రభాస్, మహేశ్ బాబుకు మోదీ లేఖలు రాశారు. మోహన్ లాల్, అనిల్ కపూర్, అనుష్కశర్మలకు కూడా మోదీ లేఖలు రాశారు. అయితే, తనకు గతంలో మద్దతు తెలిపిన, టాలీవుడ్‌లో అగ్రహీరోల్లో ఒకరైన పవన్ కల్యాణ్‌కు ఆయన లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మోదీ ఇక పవన్ ను పక్కకు పెట్టేశారేమో అని విశ్లేషకుల అభిప్రాయం.