sadavarti lands: ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేయాలని చూశారు: వాసిరెడ్డి పద్మ

  • అక్రమాలను అరికట్టేందుకే కోర్టుకు వెళ్లాం
  • ఇది వైసీసీ విజయం
  • భారీ ధర పలకడం సంతోషకరం
సదావర్తి భూములను టీడీపీ నాయకులు అప్పనంగా కాజేసేందుకు చూశారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మొదటి నుంచి తాము ఏం చెబుతున్నామో... ఇవాల్టి వేలం పాటలో అదే జరిగిందని ఆమె తెలిపారు. వేలం పాటలో సదావర్తి భూములు రూ. 60.30 కోట్లు పలకడం సంతోషకరమని చెప్పారు. ఈ భూముల విషయంలో చివరకు న్యాయమే గెలిచిందని అన్నారు. ఇది వైసీపీ సాధించిన విజయమని చెప్పారు. అక్రమాలను అడ్డుకోవడానికే తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు.

మరోవైపు వేలం వివరాలను సుప్రీంకోర్టుకు అందజేస్తామని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
sadavarti lands
sadavarti lands auction
vasireddy padma
ysrcp

More Telugu News