balka suman: చంద్రబాబు డైరెక్షన్ లోనే తెలంగాణలో కూటమి ఏర్పడింది: బాల్క సుమన్

  • టీఆర్ఎస్ ను ఆపడం ఎవరి తరం కాదు
  • గులాబీ పార్టీని ఎదుర్కోలేకే టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలు కూటమిగా ఏర్పడ్డాయి
  • ఏపీ నుంచి డబ్బు సంచులు వస్తున్నాయ్
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలు కూటమిగా ఏర్పడ్డాయని చెప్పారు. ఆంధ్రా నాయుడు పంపిన డబ్బు సంచులతో సింగరేణి ఎన్నికల్లో కూటమి నేతలు ప్రలోభాలకు గురి చేయాలని యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆ డబ్బు అండతోనే సింగరేణిలో మీటింగ్ లు పెట్టి ఏఐటీయూసీకి ఓటు వేయాలంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు ఈ కూటమి చేస్తున్న కుయుక్తులు ఫలించబోవని అన్నారు. 2014 తర్వాత టీఆర్ఎస్ ను నిలువరించడం ఎవరి తరం కావడం లేదని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
balka suman
revanth reddy
TRS
Telugudesam
congress
singareni elections

More Telugu News