ntr: కంటెంట్ ఉండాలేగానీ ఒకేసారి వంద రిలీజైనా ఆడేస్తాయి : ఎన్టీఆర్

షార్ట్స్‌లో చూడండి
'జై లవ కుశ' సినిమాతో ఈ నెల 21వ తేదీన ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనీ .. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు. అయితే ఈ సినిమాకి 'స్పైడర్' గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 'జై లవకుశ' సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ కి ఈ ప్రశ్నే ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

 తాను తన సినిమాతో పాటు విడుదలవుతోన్న ఏ సినిమాను పోటీగా భావించనని అన్నాడు. సంక్రాంతికి విడుదలైన 'ఖైదీ నెంబర్ 150' .. 'గౌతమీపుత్ర శాతకర్ణి' .. 'శతమానం భవతి' మూడూ సక్సెస్ లను సాధించిన విషయాన్ని గుర్తుచేశాడు. అందువలన పోటీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదనీ, కంటెంట్ వుండాలే గానీ, ఒకేసారి 100 సినిమాలు రిలీజైనా ఆడేస్తాయనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.     
Go Back to Shorts
ntr

More Telugu News