tspsc: రెండు కళ్ల సిద్ధాంతం ఎవరిది? పార్లమెంటులో పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది ఎవరు?: తెలంగాణ ఉద్యోగ పరీక్షల్లో ప్రశ్నలు

చంద్రబాబు, లగడపాటిలపై ప్రశ్నలు

ఉద్యమం నేపథ్యంలో ప్రశ్నలు

స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. నిన్న జరిగిన ఈ పరీక్షలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఈ తరహా ప్రశ్నలను ఇచ్చారు. 'రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది ఎవరు?' అంటూ ఓ ప్రశ్నను అడిగారు.  దీనికి ఆప్షన్లుగా జగన్మోహన్ రెడ్డి, బీవీ రాఘవులు, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు పేర్లను ఇచ్చారు. మరో ప్రశ్నగా...  'లోక్ సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది ఎవరు?' అంటూ అడిగారు. దీనికి ఆప్షన్లుగా జగన్మోహన్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, నారమల్లి శివప్రసాద్, సుజనా చౌదరిల పేర్లను ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో ఆంధ్ర, తెలంగాణలు తనకు రెండు కళ్లలాంటివని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న విషయం తెలిసిందే. లోక్ సభలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేను ఉపయోగించిన విషయం కూడా తెలిసిందే.
tspsc
staff nurse exam
chandrababu
lagadapati rajagopal
jagan
venkaiah naidu

More Telugu News