PV sindhu: హోరాహోరీ పోరులో తొలి సెట్ ను నెగ్గిన సింధూ!

షార్ట్స్‌లో చూడండి
విక్టర్ కొరియ ఓపెన్ బ్యాడ్మింటన్ పోరులో చాంపియన్ గా నిలిచేందుకు తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు మరొక్క అడుగు దూరంలో ఉంది. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో తలపడిన ఆమె, హోరాహోరీగా సాగిన తొలి సెట్ ను 22-20 తేడాతో గెలుచుకుంది. ఈ పోరు మూడు సెట్లు సాగనుండగా, ఎవరు రెండు సెట్లు గెలిస్తే వారు గెలుస్తారు. తొలి సెట్ లో ఇద్దరు సమ ఉజ్జీల మధ్యా ప్రతి పాయింట్ కోసమూ తీవ్ర పోరాటమే జరిగింది. ఓ దశలో ఒకుహరా గెలిచేలా కనిపించింది కూడా. ఒకుహరా 20-19 లీడ్ లో ఉన్న సమయంలో ఏకాగ్రత కోల్పోని సింధూ, వరుసగా పాయింట్లు సాధించి సెట్ ను కైవసం చేసుకుంది.
Go Back to Shorts
PV sindhu
okuhara
korea badminton

More Telugu News