sunil: 'సైరా నర్సింహా రెడ్డి'లో చోటు దొరికింది!: సునీల్

షార్ట్స్‌లో చూడండి
సునీల్ చాలా కాలంగా హీరో పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అయితే వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటం ఆయనని కాస్త డీలాపడేలా చేసింది. ఈ నేపథ్యంలోనే 'ఉంగరాల రాంబాబు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తాను ఆశించిన ఫలితాన్ని అందించడం ఆనందంగా ఉందని సునీల్ చెప్పాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయని అన్నాడు.

 చిరంజీవి 150వ సినిమాలోనే తాను చేయవలసి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన కుదరలేదనీ, ఆయన 151వ సినిమాగా రూపొందుతోన్న 'సైరా నరసింహా రెడ్డి'లో తనకి చోటు దొరకడం అదృష్టమని చెప్పాడు. ఈ సినిమాలో తాను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నానని అన్నాడు. ఇకపై ఒకవైపున హీరోగా చేస్తూనే .. మరో వైపున కమెడియన్ గాను కనిపిస్తాననీ, విలన్ పాత్రలు చేయడానికి కూడా ఎంతమాత్రం వెనుకాడనని చెప్పుకొచ్చాడు.           
Go Back to Shorts
sunil

More Telugu News