TTD dairy: వెంకన్నపై జీఎస్టీ ప్రభావం... భారీగా పెరిగిన 2018 క్యాలెండర్, డైరీల ధరలు

  • రూ. 75 నుంచి రూ. 90కి పెరిగిన క్యాలెండర్ ధర
  • రూ. 100 నుంచి రూ. 120కి డైరీ ధర
  • పెంచక తప్పడం లేదన్న టీటీడీ
  • 23న ఆవిష్కరించనున్న చంద్రబాబునాయుడు
వస్తు సేవల పన్ను భారం తిరుమల వెంకటేశ్వరుని భక్తులు ఎంతగానో ఇష్టపడే స్వామివారి క్యాలెండర్, డైరీలపై పడింది. వచ్చే సంవత్సరం క్యాలెండర్, డైరీల ధరలను భారీగా పెంచక తప్పడం లేదని టీటీడీ పేర్కొంది. ఆయిల్ ప్రింటింగ్ తో మంచి క్వాలిటీతో ముద్రితమయ్యే 12 పేజీల శ్రీవారి క్యాలెండర్ ధరను రూ. 75 నుంచి 90కి పెంచుతున్నామని అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో రూ. 100గా ఉండే డైరీ ధరను రూ. 120కి పెంచుతున్నట్టు పేర్కొన్నారు. మరో వారంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు, ఈ నెల 23న తిరుమలకు వచ్చే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు వీటిని ఆవిష్కరించనుండగా, ఆ తరువాత వీటిని భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచుతారు.
TTD dairy
calender
GST

More Telugu News