arjan singh: 'మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్' అర్జన్ సింగ్ ఇకలేరు!

'మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్' అర్జన్ సింగ్ (98) ఇకలేరు. ఈ రోజు ఉదయం ఆయ‌న‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయ‌న‌ను ఆర్మీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, ఈ రోజు రాత్రి 7.47 గంటలకు ఆయ‌న గుండెపోటుతో మృతి చెందార‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. ఆయ‌న 1965 భార‌త్‌, పాకిస్థాన్ యుద్ధ స‌మ‌యంలో ఐఏఎఫ్ చీఫ్‌గా సేవ‌లు అందించారు. ఆయ‌న అందించిన సేవ‌ల‌కు గుర్తుగా 2016లో వెస్ట్‌బెంగాల్‌లోని ప్ర‌న‌గ‌ర్ బేస్‌కి 'ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్ అర్జ‌న్ సింగ్' అని పేరు పెట్టారు. ఆయ‌న ఏప్రిల్ 15, 1919లో ల్యాల్లాపూర్ (నేటి పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో) జ‌న్మించారు. అర్జన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు.
arjan singh

More Telugu News