rk studios: ముంబైలోని రాజ్ కపూర్ స్టూడియోలో అగ్ని ప్రమాదం!

ముంబైలోని ప్రఖ్యాత ఆర్కే ఫిల్మ్ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్టూడియోలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రమాదం చోటు చేసుకుంది. సెట్టింగ్ కోసం ఎలక్ట్రిక్ వైర్లను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్టూడియో నుంచి అందరినీ బయటకు పంపించేశారు. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదం వల్ల ఎవరైనా మృతి చెందినట్టు కాని, గాయపడినట్టు కాని ఇంకా సమాచారం లేదు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ 1948లో ఈ స్టూడియోను స్థాపించారు. 
rk studios
raj kapoor
fire accident at rk studios

More Telugu News