sanjay dutt: ముగ్గురు హీరోయిన్స్ తో కథ నడిపించాను : బాలీవుడ్ స్టార్ హీరో!

  •  యాక్షన్ హీరోగా తెరపై తనదైన ముద్రవేసిన సంజయ్ దత్
  •  రొమాంటిక్ హీరోగా బయట జోరుగా ప్రచారం
  •  ముగ్గురు హీరోయిన్స్ తో లవ్ ఎఫైర్
  •  బోల్డ్ గా చెప్పేసిన సంజయ్ దత్   
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో సంజయ్ దత్ పేరు స్పష్టంగా కనిపిస్తుంది. హీమ్యాన్ లుక్ తో రొమాంటిక్ హీరోగాను .. యాక్షన్ హీరోగాను ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. యంగ్ హీరోగా వున్న సమయంలో కొంతమంది కథానాయికలతో ఆయన ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించాడనే టాక్ వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అది నిజమేననే విషయాన్ని ఆయన అంగీకరించారు.

 ఇద్దరు కథానాయికలతో లవ్ ఎఫైర్ ను కొనసాగించారట కదా? అనే ప్రశ్నకి ఆయన నవ్వుతూ, ఇద్దరు కాదు .. ముగ్గురు అని చెప్పారు. తెలివి తేటలు వుండాలే గానీ .. ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమ వ్యవహారాలు నడిపించవచ్చని మరో ప్రశ్నకి సమాధానమిచ్చారు. చాలా బోల్డ్ గా .. సరదాగా ఆయన ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి.   
sanjay dutt

More Telugu News