Chandrababu: నంద్యాలకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

19న నంద్యాలకు చంద్రబాబు

అభివృద్ధి పనుల పరిశీలన

నంద్యాల ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పనున్న సీఎం


ఈ నెల 19న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్తున్నారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత నంద్యాలకు చంద్రబాబు ఇంతవరకు వెళ్లలేదు. మరోవైపు, ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పనులను స్వయంగా పరిశీలించడానికి చంద్రబాబు నంద్యాలకు వెళుతున్నారు. దీనికితోడు, పార్టీకి ఘనవిజయాన్ని కట్టబెట్టిన నంద్యాల ఓటర్లకు చంద్రబాబు ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలపనున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఫరూక్, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు నేడు సమావేశమై... చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లపై చర్చించారు.
Chandrababu
ap cm
chandrababu nandyal tour

More Telugu News