saina: శ్ర‌ద్ధా క‌పూర్‌కి మ‌రో ఆతిథ్యం... ఈసారి సైనా నెహ్వాల్‌!

  • హీరోయిన్‌ని గారాబం చేసిన‌ సైనా త‌ల్లి
  • గ‌ర్వంగా ప‌త‌కాల‌ను చూపించిన సైనా తండ్రి
  • ఇన్‌స్టాగ్రాం ఫొటోలు షేర్ చేసిన శ్ర‌ద్ధా

ఇటీవ‌ల `సాహో` షూటింగ్ భోజ‌న స‌మ‌యంలో హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్‌కి ప్ర‌భాస్ ఆంధ్రా రుచుల్ని ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. అదే బాట‌లో సైనా నెహ్వాల్ కుటుంబం కూడా శ్ర‌ద్ధా క‌పూర్‌కి వారి వంట‌కాల‌ను రుచి చూపించింది. సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌లో ఆమె పాత్ర‌ను శ్రద్ధా పోషిస్తోంది. అందుకోసం ప్ర‌స్తుతం సైనా ద‌గ్గ‌ర శ్ర‌ద్ధా కొన్ని మెల‌కువ‌లు నేర్చుకుంటోంది. అందులో భాగంగా శుక్ర‌వారం శ్ర‌ద్ధా క‌పూర్, సైనా ఇంటికి వెళ్లింది.

ఈ సందర్భంగా అక్క‌డి ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. సైనా త‌ల్లి త‌న‌ను చాలా గారాబం చేసింద‌ని, పూరీ, చోళే, ఖీర్‌, హ‌ల్వాల‌ను రుచి చూపించింద‌ని శ్ర‌ద్ధా తెలిపింది. అలాగే సైనా తండ్రి, కూతురు సాధించిన ప‌త‌కాల‌ను చాలా గ‌ర్వ‌ప‌డుతూ చూపించార‌ని పేర్కొంది. సైనా ఒలింపిక్ ప‌త‌కానికి సంబంధించిన ఫొటోను కూడా శ్ర‌ద్ధా పోస్ట్ చేసింది. అలాగే శ్ర‌ద్ధా క‌పూర్, త‌మ పెంపుడు కుక్క చాప్సీతో ఆడుకుంటున్న వీడియోను సైనా నెహ్వాల్ షేర్ చేసింది.

More Telugu News