keerthi suresh: 'మహానటి' కోసం ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు!

  •   పాలకొల్లులో 'మహానటి' షూటింగ్
  •  సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ 
  •  అక్టోబర్ నుంచి ఆయన సీన్స్ చిత్రీకరణ
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'పాలకొల్లు'లో జరుగుతోంది. 'సావిత్రి' జీవితచరిత్రగా రూపొందుతోన్న ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కీర్తి సురేశ్ పోషిస్తోంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. మరో ముఖ్యమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు.

ఇక ఎస్వీ రంగారావు .. సావిత్రి మధ్య ఎంతో అనుబంధం వుంది. ఎస్వీఆర్ ను సావిత్రి "నాన్నా" అని పిలిచేదట. ఆయన ఓ కూతురులా ఆమెను చూసుకునేవారని అంటారు. అలాంటి ఎస్వీఆర్ పాత్ర కూడా ఈ సినిమాలో కీలకమే. ఈ పాత్ర కోసం మోహన్ బాబును ఒప్పించారని సమాచారం. అక్టోబర్ నుంచి ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నారు. ఇక ఎన్టీఆర్ .. ఏఎన్నార్ పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.     
keerthi suresh
mohan babu

More Telugu News