అనారోగ్యం నుంచి కోలుకున్న అఖిల్ .. ఢిల్లీలో షూటింగ్!
- 'హలో' మూవీ చేస్తోన్న అఖిల్
- షూటింగులో అనారోగ్యం
- వారం తరువాత కోలుకున్న అఖిల్
- మళ్లీ షూటింగ్ మొదలు
ఇప్పుడు ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. షూటింగులో జాయినైన అఖిల్ "అనారోగ్యం కారణంగా ఓ వారం రోజుల పాటు బ్రేక్ తీసుకుని మళ్లీ వచ్చేశా. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో షూటింగ్ చేస్తున్నందుకు ఆనందంగా వుంది" అంటూ అక్కడ తీసుకున్న సెల్ఫీ ని పోస్ట్ చేశాడు. అఖిల్ జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను, డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు.