tirupati: తిరుపతిలో ఫ్యాషన్ డిజైనర్ ను ప్రేమ వివాహం చేసుకున్న తమిళ సంగీత దర్శకుడు!

  • 12న వైభవంగా ధరమ్, దీక్షితల సంగీత్
  • శుక్రవారం నాడు తిరుపతిలో వైభవంగా వివాహం
  • హాజరైన పలువురు సెలబ్రిటీలు
తమిళ చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్న ధరమ్ కుమార్ శుక్రవారం రాత్రి తిరుపతిలో, తాను వలచిన మగువను మనువాడాడు. ఫ్యాషన్ డిజైనర్ గా, నటి దీక్షితతో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న ధరమ్, ఇటీవలే ఆమెను పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించాడు కూడా. ఈ నెల 12న వీరిద్దరి సంగీత్ వైభవంగా జరగగా, నిన్న తిరుపతికి వచ్చిన ఈ జంట మూడుముళ్లతో ఒకటైంది. అందంగా అలంకరించిన ఆటో వెనుక సీట్లో దీక్షిత కూర్చోగా, దాన్ని స్వయంగా నడుపుకుంటూ మండపానికి తీసుకువచ్చాడు ధరమ్. ఈ సందర్భంగా ఇద్దరూ కలసి కొన్ని స్టెప్పులు కూడా వేశారు. వీరి పెళ్లికి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హాజరు కావడంతో సందడి నెలకొంది. నూతన జంటకు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.
tirupati
dharam kumar
deekshita

More Telugu News