ధోనీని 'గోట్' అన్న సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్
- గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
- అభిమాని ప్రశ్నకు మాలిక్ సమాధానం
- ఆనందపడుతున్న ధోనీ ఫ్యాన్స్
ఇక 'గోట్' అంటే 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అంటూ కూడా షోయబ్ చెప్పాడు. ఇక తమ అభిమాన స్టార్ ప్లేయర్ ధోనీ గురించి పాకిస్థాన్ ఆటగాడి నుంచి ఇలాంటి పొగడ్త రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కాగా, భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదన్న సంగతి తెలిసిందే. వరల్డ్ సిరీస్ లలో మాత్రం ఇరు దేశాలూ పోటీ పడుతున్నాయి. చివరిగా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో భారత్, పాక్ తలపడగా, పాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.