: స‌ద్గురు జ‌గ్గీవాసుదేవ్‌ను కలసిన రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు!


`ర్యాలీ ఫ‌ర్ రివ‌ర్స్` కార్యక్ర‌మాన్ని ప్ర‌చారం చేస్తున్న స‌ద్గురు జ‌గ్గీవాసుదేవ్‌ను రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు ఈ రోజు కలిశారు. సద్గురుతో క‌లిసి వారిద్ద‌రూ దిగిన ఫొటోను రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. `స‌ద్గురు సన్నిధిలో ఏదో అద్భుతం వుంది. పాజిటివిటీలో ఉన్న శ‌క్తిని న‌మ్మ‌క త‌ప్పడం లేదు. రైతులకు సాయం చేయడానికి ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌`కి మద్దతు తెల‌పండి` అంటూ ఆమె పోస్ట్ చేసింది.

న‌దీ జలాల సంరక్షణ కోసం ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ కార్యక్రమాన్ని సద్గురు జ‌గ్గీవాసుదేవ్ తీవ్రంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు, పోస్టుల ద్వారా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

  • Loading...

More Telugu News