: సదావర్తి భూములపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు
సదావర్తి భూములకు మరోసారి వేలం నిర్వహించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, సదావర్తి భూముల వేలాన్ని నిలిపి వేయాలని సుప్రీంకోర్టులో తమిళనాడు పిటిషన్ వేసింది. ఆ భూములతో ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి సంబంధం లేదని అందులో పేర్కొంది. ఒకవేళ ఇప్పటికే వేలం జరిగితే రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది. నామమాత్రపు ధరకు ఆ సత్రం భూముల్ని వేలం వేయడంపై గతంలో పిటిషన్ దాఖలు కాగా తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తమిళనాడు కూడా అభ్యంతరం తెలుపుతుండడంతో మరోసారి సదావర్తి భూముల అంశం ఆసక్తికరంగా మారింది.