: పెళ్లిని ఆపిన ఫేస్ బుక్ పోస్టు... మంచి పని జరిగిందన్న ఆస్ట్రేలియా ప్రధాని!

  • గే మ్యారేజ్ లకు మద్దతుగా వ్యాఖ్యలు
  • చట్టబద్ధత కల్పించాలని డిమాండ్
  • తీవ్రంగా స్పందిస్తూ పెళ్లిని ఆపిన చర్చి మినిస్టర్
  • కాసేపట్లో వివాహమనగా ఘటన

సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టు తన పెళ్లినే ఆపుతుందని, సాక్షాత్తూ ప్రధానమంత్రి కూడా దాన్ని సమర్థిస్తారని ఆ యువతి ఊహించి ఉండదు. ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టును చూపుతూ కాసేపట్లో వివాహం చేసుకోవాల్సిన యువతిని మతాధికారులు అడ్డుకున్న ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరిగింది. దీనిపై ప్రధాని మాల్కం టర్న్ బుల్ స్పందిస్తూ, పెళ్లిని నిలపాలన్న చర్చి మినిస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తమకున్న ప్రత్యేక అధికారాలను వారు వినియోగించి మంచి పని చేశారని ప్రశంసించారు.

ఇంతకూ ఆమె ఏమని పోస్టు పెట్టిందో తెలుసా? స్వలింగ సంపర్క వివాహాలకు మద్దతు పలుకుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా వివాహాలకు సంబంధించి చట్టాల్లో మార్పులు అత్యవసరమని అభిప్రాయపడింది. ఆస్ట్రేలియాలో గే మ్యారేజ్ లకు చట్టబద్ధత లేదన్న సంగతి తెలిసిందే. ఇక ఆమె తన ప్రియుడితో కలసి వివాహం చేసుకునేందుకు బల్లారట్ లోని ఓ చర్చికి రాగా, వివరాలు అడిగి తెలుసుకున్న మత పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆమె ఫేస్ బుక్ పోస్టు గురించి వారికి తెలిసింది. దీంతో వారీ పెళ్లిని రద్దు చేశారు.

  • Loading...

More Telugu News