: టీడీపీలో చేరుతామంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నాకు ఫోన్లు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
- పార్టీలో చేరుతామంటూ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు
- వైసీపీ భవితవ్యంపై వారిలో భయం నెలకొంది
- రానున్న ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకు పోతుంది
- అచ్చెన్నాయుడి కీలక వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీలో చేరుతామంటూ పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పదే పదే తనకు ఫోన్లు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకే నేరుగా ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. ఇదే విధంగా ఇతర టీడీపీ ముఖ్య నేతలకు కూడా ఇతర వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తున్నాయని అన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో దీనిపై చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పిన్నింటిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.