: బైక్ నడిపే పాండా ఇక లేదు... కన్నుమూసిన `బాసి`!
చైనాలో బైక్ నడుపుతూ, బాస్కెట్‌బాల్ ఆడుతూ అందర్నీ అలరించిన సెలబ్రిటీ పాండా `బాసి` కన్నుమూసింది. 37 ఏళ్ల పాటు జీవించిన ఈ జెయింట్ పాండా గురువారం చనిపోయింది. సాధారణంగా జెయింట్ పాండాల జీవిత కాలం 20 ఏళ్లు, కానీ ఈ పాండా అంతకంటే ఎక్కువ కాలం బతకడం విశేషం. జూలో దీనికి పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించేవారు. 35వ పుట్టినరోజు సందర్భంగా జూలో దీని రాతి విగ్రహం కూడా ఏర్పాటుచేశారు. 1990లో చైనాలో జరిగిన ఏసియన్ గేమ్స్ మస్కట్ `పాన్‌పన్`కి ఇదే స్ఫూర్తి. సెప్టెంబర్ 13 ఉదయం 8:50కి బాసి చనిపోయిందని జూ ప్రతినిధులు తెలిపారు.