puri: పూరీ తనయుడి సినిమా కోసం కాస్టింగ్ కాల్!

ఒక సినిమా ఇలా జనం ముందుకు వెళ్లిందో లేదో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడం పూరీ జగన్నాథ్ కి అలవాటు. అలాగే ఈ సారి కూడా ఆయన 'పైసా వసూల్' తరువాత నెక్స్ట్ మూవీకి చకచకా రంగాన్ని సిద్ధం చేసేస్తున్నాడు. తన తదుపరి చిత్రం తన తనయుడు ఆకాశ్ తో వుంటుందనే విషయాన్ని ఆయన ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆ సినిమాకి సంబంధించిన కొత్త ఆర్టిస్టుల కోసం పూరీ కనెక్ట్స్ ద్వారా కాస్టింగ్ కాల్ ఇచ్చారు. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుషులు .. 18 నుంచి 45 ఏళ్ల వయసున్న స్త్రీలు, తమ దగ్గర యాక్టింగ్ టాలెంట్ ఉందనుకుంటే ప్రయత్నం చేయవచ్చు. ఇందుకు సంబంధించిన తతంగమంతా ఛార్మి పర్యవేక్షణలో జరుగుతుంది. ఫైనల్ చేసేది మాత్రం పూరీ జగన్నాథే. తన తనయుడి కోసం రాసుకున్న లవ్ స్టోరీతో వచ్చే నెలలోనే పూరీ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.   
puri
akash

More Telugu News