: ప్రతిపక్షం అన్నది లేకుండా చేయడం చంద్రబాబుకు సాధ్యం కాదు: సీపీఎం నేత మధు
ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అనడం సబబు కాదని, ఆ విధంగా చేయడం ఆయనకు సాధ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నవారు ఏదైనా మాట్లాడతారని, వాళ్ల లోపాలు వాళ్లకి కనబడవని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మూడేళ్లయినా యూత్ పాలసీ హామీ అమలు చెయ్యలేదని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్ట్ లను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి అమలు కోసం తాము ఉద్యమిస్తామని మధు చెప్పారు.