: కేపీహెచ్ బీ కాలనీలోని జేఎన్టీయూలో కుప్పకూలిన భవనం
హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో ఉన్న జేఎన్టీయూలో ఓ బిల్డింగ్ కుప్పకూలింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే యూనివర్శిటీలోని మెకానికల్ విభాగానికి చెందిన ఈ భవనం కూలిపోయిందని భావిస్తున్నారు. మరోవైపు, దీని వెనుక ఇతర కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేపట్టారు. కుప్పకూలిన ఈ భవనం పేరు పోర్టికో. అయితే, ఆ సమయంలో విద్యార్థులెవరూ అందులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.