: టెన్నిస్ తార సెరీనా విలియమ్స్ కూతురి ఫస్ట్ ఫొటో.. మీరూ చూడండి


టెన్నిస్ స్టార్  సెరీనా విలియమ్స్ రెండు వారాల క్రితం పండంటి అమ్మాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, తన గారాలపట్టి తొలి ఫొటోను సెరీనా బయటి ప్రపంచానికి తొలిసారి చూపించింది. తన గుండెలపై పడుకున్న చిన్నారి ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది. డెలివరీ అయిన తర్వాత ఇక వారం పాటు ఆసుపత్రిలోనే ఉన్నామని తెలిపింది. రెడిట్ సంస్థ సహ వ్యవస్థాపకుడైన అలెక్స్ ఒహానియన్ తో సెరీనా సహజీవనం చేస్తోంది. 

  • Loading...

More Telugu News