: ఐఫోన్ ఎక్స్ కొంటారా? దుబాయ్, హాంకాంగ్ వెళ్లి కొనుక్కోండి... చౌక గురూ!


స్మార్ట్ ఫోన్ ప్రియులు ఐఫోన్ కోసం ఎంతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొత్త యాపిల్ ఐఫోన్ వస్తుందంటే గంటలకొద్దీ, రోజుల కొద్దీ షోరూముల ముందు క్యూలు కనిపిస్తుంటాయి. ఇక తాజాగా వచ్చిన ఐఫోన్ ఎక్స్ ధర ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో ధరపై లభిస్తోంది. ఇండియాలో లక్షకు పైగా ఉన్న ధర దుబాయ్, హాంకాంగ్ లలో రూ. 71 వేలు మాత్రమే. ఇక ఇండియన్స్ ఎవరైనా ఐఫోన్ కొనాలని భావిస్తే, వేరే దేశానికి విమానం టికెట్, హోటల్ చార్జీలు సహా పైఖర్చులన్నీ కలుపుకున్నా లక్ష దాటదని సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి. ఎలాగో పరిశీలిస్తే... దుబాయ్ కానీ, హాంకాంగ్ రౌండ్ ట్రిప్ టికెట్ ఖరీదు రూ. 14 వేల వరకూ ఉంది. 2 స్టార్ హోటల్ లో ఒక రోజు గడిపేందుకు రూ. 3 వేల వరకూ పెట్టాల్సి వుంటుంది. రూ. 71 వేలు పెట్టి ఐ ఫోన్ కొనుక్కొని చక్కా తిరిగి రావచ్చు. పై డబ్బును ఇతర ఖర్చులకు వాడుకోవచ్చు.. విదేశాలకు వెళ్లి వచ్చానని సోషల్ మీడియాలో ఎన్ని ఫోటోలైనా పెట్టుకోవచ్చు. ఇదేదో బాగుంది కదా?!

  • Loading...

More Telugu News