: చంద్రబాబు మనవడు దేవాన్ష్ కు గిఫ్ట్ గా సైకిల్ !


ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ కు సైకిల్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఈ గిఫ్ట్ చంద్రబాబు కొన్నది కాదు. శ్రీకాకుళంలో ఇటీవల చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటికి ఆయన వెళ్లగా, ఆ ఇంట్లోని కుటుంబసభ్యులు ఈ సైకిల్ ని దేవాన్ష్ కు కానుకగా ఇవ్వాలని కోరుతూ చంద్రబాబుకు ఇచ్చారు.

అయితే, ఎటువంటి కానుకలను తీసుకోని చంద్రబాబు, ఈ సైకిల్ ని చూసి ముచ్చటపడ్డారు.. దేవాన్ష్ తొక్కితే ముచ్చటగా ఉంటుందని అనుకున్నారు. అదీగాక, ఆ కుటుంబసభ్యులు ఎంతో ప్రేమగా ఈ సైకిల్ ను ఇవ్వడంతో కాదనలేకపోయారు. దీంతో, ఈ చిన్న సైకిల్ ను విజయవాడకు తీసుకురమ్మని తమ వారికి చంద్రబాబు పురమాయించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News