: అహ్మదాబాద్ లో నేడు బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి శంకుస్థాపన!
నేడు అహ్మదాబాద్ లో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ముంబయి - అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేర రైలు మార్గ నిర్మాణానికి భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే శంకుస్థాపన చేయనున్నారు. గత ఏడాది నవంబరులో మోదీ జపాన్ పర్యటనలో బుల్లెట్ రైలు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సంబంధించి 2017లో భూమి పూజ జరగగా, 2018 లో నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుండటం గమనార్హం.
కాగా, జపాన్ ప్రధాని షింజో అబే రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చారు. నేడు ప్రధాని మోదీతో ఆయన భేటీ అవుతారు. రక్షణ, భద్రతా రంగాల్లో సంబంధాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించనున్నారు. గాంధీనగర్ లో జరిగే భారత్-జపాన్ 12వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు షింజో హాజరుకానున్నారు.