: ఓ సూపర్ స్టార్ ఇలా ఉండటం నేనెప్పుడూ చూడలేదు: ‘కాలా’ స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్
రజనీకాంత్ చాలా వినయం గల వ్యక్తి అని, ఓ సూపర్ స్టార్ ఇలా ఉండటం తానెప్పుడూ చూడలేదని ‘కాలా’చిత్ర స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరామన్ ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రజనీకాంత్ తో కలసి పనిచేయడం ఓ అద్భుతమైన అనుభవమని, ఆయన వస్తుంటే అందరూ నిశ్శబ్దంగా ఉండి పోతారని , రజనీలో తనకు నచ్చిన విషయం సింప్లిసిటీ అని అన్నారు. కాగా, పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీ సరసన బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ‘కాలా’ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది.