: చిన్నారుల్లో మతోన్మాదం... క్రైస్తవ విద్యార్థిని కొట్టి చంపేసిన ముస్లిం విద్యార్థులు!
పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్రైస్తవ మతానికి చెందిన షరూన్ మాషి (17) అనే విద్యార్థి అక్కడి స్థానిక ఎమ్‌సీ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవలే చేరాడు. అయితే, స్కూల్లో ఓ ముస్లిం విద్యార్థి తాగిన గ్లాసుతో షరూన్ మాషి మంచినీళ్లు తాగాడు. దీంతో ముస్లిం విద్యార్థి తాగిన గ్లాసుతో మంచి నీళ్లు ఎందుకు తాగావంటూ తోటి విద్యార్థులు అతన్ని తరగతి గదిలోనే చితక్కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఆ క్రైస్తవ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాలలో ముస్లిం విద్యార్థులు తమ కుమారుడిని తరుచూ ఏడిపించేవారని అతడి తల్లి చెప్పింది.