: ధైర్యానికే ఓ ముఖం ఉంటే.. అది కంగ‌నా ర‌నౌత్!: సమంత కాంప్లిమెంట్


బాలీవుడ్ ప్రముఖుల తీరును గురించి వివరిస్తూ వ్యంగ్య రూపకంగా తీసిన ఓ మ్యూజిక్ వీడియోను నటి కంగనా రనౌత్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. అందులో కంగనా రనౌత్ బాలీవుడ్ తీరును ఎండగట్టిన వైనం చెన్నై బ్యూటీ సమంతకు బాగా నచ్చేసినట్లుంది. కంగనా రనౌత్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేసింది. ఆమె ఓ లెజెండరీ అని సమంత పేర్కొంది. ధైర్యానికే ఓ ముఖం ఉంటే అది కంగ‌నా ర‌నౌతేన‌ని ట్వీట్ చేసింది. కంగ‌నా ర‌నౌత్ విడుద‌ల చేసిన ఈ వీడియో బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పాట‌లో ఉప‌యోగించిన కొన్ని ప‌దాలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News