: రష్యా అధ్యక్షుడిని గుర్తించి, షేక్ హ్యాండ్ ఇచ్చిన రోబో... వీడియో చూడండి!
ఎవరినైనా ఒక్కసారి చూస్తే గుర్తుపెట్టుకునే ప్రొమోబోట్ అనే రోబో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని గుర్తించి, ఆయనకి షేక్‌హ్యాండ్ కూడా ఇచ్చింది. పెర్మ్‌లో జరుగుతున్న టెక్నాలజీ ఎగ్జిబిషన్‌కి పుతిన్ హాజరయ్యారు. అక్కడ స్టాళ్లను పరిశీలిస్తున్న పుతిన్‌ను ప్రొమోబోట్ గుర్తుపట్టి, చేతులు కలుపుతూ తనను తాను పరిచయం చేసుకుంది. పుతిన్‌కి రోబో షేక్‌హ్యాండ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ రోబోను టూర్‌గైడ్‌గా, సేల్స్ ప్రమోటర్‌గా, మోడల్‌గా రష్యాలో ఉపయోగిస్తారు. ఆ దేశానికి చెందిన కొంతమంది ప్రముఖుల ముఖాలను ఈ ప్రొమోబోట్ గుర్తించగలదు. గతేడాది తయారీ ల్యాబ్ నుంచి తప్పించుకుని ఈ ప్రొమోబోట్ వార్తల్లో నిలిచింది. దీని కారణంగా ఒకసారి ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే మాస్కోలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల ర్యాలీలో పాల్గొనడంతో దీన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.